Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి - బిజెపి నాయకులు

Digital Kasipet:- 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాసిపేట మండలంలో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉఫాద్యక్షుడు రమేష్ అన్నారు. శనివారం కాసిపేట ఏఈఓ రమ్యకు వినతి పత్రం సమర్పించారు. గత కొద్ది రోజుల నుండి వర్షాలు కురవడంతో రైతుల వేసుకున్న పత్తి, కంది పంటలు భారీ వర్షాలకు కొట్టుకుపోయి కొన్ని పొలాలలో ఇసుక మేటలు వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పోసప్పో చేసి ఆరుగాలం కష్టపడి విత్తనాలు వేసుకుంటే కుండపోత వర్షంతో రైతుల జీవితాలు కకా వికాలం అయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రతి గ్రామంలో తాహశీల్దార్ తో నష్టపోయిన రైతుల యొక్క పొలాలను సర్వే చేసి ఎంత నష్ట పోయారో నిర్ధారించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ మోర్చా  మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, బీజేవైఎం  మండల ప్రధానకార్యదర్శి, సూరం సంపత్, బాకీ నరేష్ మండల ఉపాధ్యక్షులు, బాకీ కిరణ్ మండల సెక్రెటరీ, బిజెపి నాయకులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App