Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కస్తూరిబా పాఠశాలను సందర్శించి న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Digital Kasipet:- 
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతిభారీ వర్షాలకు కాసిపేట మండల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ప్రాంగణంలో నీరు నిల్వ అయిందనే సమాచారం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం  హుటాహుటిన మండల కేంద్రానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విద్యాలయం ప్రాంగణం చుట్టూ పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. నీరు బయటకు వెళ్లేలా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. చేతిలో ప్రాంగణం లో నీరు నిలువకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సంబంధిత అధికారులకు ఫోన్ లో  ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విద్యార్థినిలతో మాట్లాడుతూ పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తమకు తెలియపర్చాలని,వైస్ ఎంపీపీ విక్రమ్ గారు,ఉప సర్పంచ్ తిరుపతి మరియు ఇతర తెరాసా నాయకులు అందుబాటులో ఉంటారని, తాము వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ , ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి, ఇతర ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి పట్టణ TRSV అద్యక్షుడు శ్రావణ్ , వైస్ ప్రెసిడెంట్ యూనుస్, తెరాసా నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App