Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆర్టిసి ఛార్జిలు పెంపుకు బీజేపీ నాయకుల నిరసన

Digital Kasipet:- 
తెలంగాణ రాష్ట్రంలో పెంచిన ఆర్టిసి ఛార్జిలకు నిరసనగా కాసిపేట మండల బీజేపీ నాయకులు రోడ్డు మీద నిరసన తెలిపారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద వాడి మీద మోయలేని భారాన్ని మోపడం సరికాదని అన్నారు. ఆర్టీసీ  ఛార్జీలు తగ్గించని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్, Bc మోర్చా మండల అధ్యక్షులు శంకర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, పోల వేణి పోషo, మండల ఉపాధ్యక్షులు, శంకరన్న, పుర్ర సాయి. బాకీ కిరణ్, బాకీ సురేష్, హనుమంతు. మహేష్, శ్రావణ్, తదితర  బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App