Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

క్రీడా మైదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

Digital Kasipet:- 
గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పల్లె పకృతి వనం, వైకుంఠ ధామాలు, గ్రామీణ క్రీడల కోసం ప్రాంగణాలు, ఏర్పాటు చేయడం జరిగిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో భాగంగా ముత్యంపల్లిలో గ్రామీణ క్రీడల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యువతే ఈ దేశానికి, రాష్ట్రానికి వెన్నుముక అని యువకుల కోసం క్రీడా ప్రాంగణాలు, స్మశాన వాటికలు, ప్రతి గ్రామానికి నీళ్ల ట్యాంకులు, పల్లె ప్రకృతి వనాలు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి , సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య,ఎంపీపీ రోడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు,సింగిల్విండో చైర్మన్ నీలా రాంచందర్, ఆడే బాదు, రైతు సంఘం అధ్యక్షులు దుర్గం పోశం, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపెల్లి లక్ష్మి, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మోటూరి వేణు, ఓసిసి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి, వాసుదేవ్, శంకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, తెరాస నాయకులు, లంక లక్ష్మణ్, జాడీ రాంచందర్ వడ్లూరి మల్లేష్, వార్డు మెంబర్లు అగ్గి స్వామి, రేణుక, గంగ షంషీర్, తిరుపతి రెడ్డి, దుర్గం రాంచందర్,మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App