Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్యా పెట్రోల్ పై 9.50 రూపాయలు మరియు డీజిల్ పై 7 రూపాయలు తగ్గించడం జరిగిందని, వంట గ్యాస్ పైన 200 రూపాయలు సబ్సిడీ ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే వ్యాట్ 10 నుండి 15 రూపాయలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడిస్తూ పరిపాలన చేస్తుందని, తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ చార్జీలు, విద్యుత్, మద్యం చార్జీలు, పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు చనిపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రైతులను పట్టించుకోకుండా ఇతర పంజాబ్ రాష్ట్రాల్లో మూడు లక్షలు ఇవ్వడం చాలా బాధాకర విషయమని, తక్షణమే రైతులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటక పురం రమేష్, బిజెపి ముత్యంపల్లి గ్రామ అధ్యక్షులు పంబాల అరవింద్, బీజేవైఎం ఉపాధ్యక్షులు సాయికుమార్, ముత్యoపల్లి బూత్ అధ్యక్షులు హనుమంతు, సంతోష్ మహేష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.