Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో శనివారం ఉదయం మహ్మాద్ రిజ్వన(18) అనే యువతి జీవితం పై విరక్తి చెంది తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహాత్యకు పాల్పడింది. ముత్యంపల్లి గ్రామానికి చెందిన రిజ్వన చిన్న తనం నుండి అనారోగ్యంగా ఉంటున్నట్లు కుటింబికులు పేర్కొన్నారు. రక్తహీనత, ఫిట్స్ ఉండడంతో రిజ్వనను ఎప్పుడు ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండేవారని, రక్తం ఎక్కించే వారని, ఇటివల కూడా ఆసుపత్రికి తీసుకొని వెళ్లగ వేలాది రూపాయలు ఖర్చు కావడంతో రిజ్వన మనస్థాపం చెంది తల్లిదండ్రులకు బారం కాకుడదనే కారణంగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్యహాత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం రిజ్వన తల్లి ప్రక్కనే ఉన్న తన తల్లి వారి ఇంటికి వెళ్లి వచ్చె సరికి రిజ్వన ఇంట్లో ఉరివేసుకొని ఉందని ఆమె పేర్కొన్నారు. మందమర్రి సిఐ ప్రమోద్రావ్ సంఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. కాసిపేట ఎస్ హెచ్ఓ ఇలియాస్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి మహ్మాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్దం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.