Digital Kasipet:-
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో ధర్మారావుపేట్ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ వేసంగి లో వరి పండించిన రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు కు సహకరించడం లేదని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో వడ్ల కొనుగోలు ప్రారంభిస్తున్నామని అన్నారు. రైతులు సకాలంలో వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బి.నీల, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్ర య్య, గ్రామ సర్పంచి లక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గం పోశం, సింగిల్ విండో వైస్ చైర్మన్ తాటిపాముల శంకర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, మాజీ జెడ్ పి టి సి రౌత్ సత్తయ్య, మాజీ ఎంపీపీ సిడం జంగు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు.