Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిజాయతీ చాటుకున్న జర్నలిస్ట్ అనిల్

Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ఏల్పుల అనిల్ కుమార్ అనే జర్నలిస్టు తన నిజాయితీ  చాటుకున్నాడు. కాసిపేట మండల దిశ పత్రిక జర్నలిస్ట్, కాసిపేట ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ ఏల్పుల అనిల్ కుమార్ శనివారం ఉదయం బస్సులో గోదావరిఖని నుంచి కాసిపేటకి వస్తుండగా బస్సులో మొబైల్ దొరికింది. బస్సులో ఇతరులను మొబైల్ కోసం అడగగా మాది కాదు అంటూ సమాధానం చెప్పారు. మొబైల్ విలువ సుమారు రూ.25,000 ఉంటుంది. దీనితో మొబైల్ కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ మేరకు మొబైల్ యజమాని రాజమండ్రికి  చెందిన శ్రీనివాస్ రెడ్డి తన మొబైల్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కాసిపేట పోలీస్ స్టేషన్ లో కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేష్ చేతుల మీదుగా మొబైల్ ను యాజమాని శ్రీనివాస్ రెడ్డి కి అందించారు.ఈ సందర్బంగా జర్నలిస్ట్ అనిల్ కుమార్ ను కాసిపేట ఎస్ఐ కల్యాణం నరేశ్ అభినందించారు.అనంతరం మొబైల్ యాజమాని శ్రీనివాస్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ అనిల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App