Digital Kasipet:-
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని పాత తిరుమలాపూర్ గిరిజనులు తాగునీటి కోసం తల్లడిల్లు తున్నారు. గ్రామానికి నీటిని అందించే బోర్ వెల్స్ చెడిపోవడం వల్ల నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ పైపు లైన్ వేసి నల్లాలు బిగించిన నీళ్లు రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇప్పించాలని TRS పార్టి రొట్టెపల్లి గ్రామ పంచాయతి పరిధి అద్యక్షులు అల్క పెద్దులు గారికి గిరిజనులు నీళ్ల బిందెల తో ఎదురెళ్లి నిరసన తెలియ జేశారు. నీటి సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కా రానికి కృషి చేస్తానని అల్కా పెద్దులు గిరిజనులకు హామీ ఇచ్చారని తెలిపారు . మండల అభివృద్ధి అధికారి అలీమ్, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య తక్షణమే స్పందించి పాత తిరుమలాపూర్ గిరిజనుల తాగునీటి సమస్యలు పరిష్కరించాలని Digital Kasipet కోరుతుంది.