Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రం లోని తెలుగు తల్లి మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం మండల సమాఖ్య, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యం పల్లి శాఖ అధికారుల సమావేశం జరిగింది. సమావేశంలో బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22లో మండలంలోని వివిధ గ్రామాలలోని 213 మహిళా గ్రూపులకు 14.5 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వడంలో ముత్యం పెళ్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మంచిర్యాల జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉందని అన్నారు. బ్యాంకు అన్ని వర్గాలకు స్వయం ఉపాధి కోసం రుణాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బంగారం పై కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. తదనంతరం రుణాల లక్ష్యాన్ని సాధించడం లో కృషిచేసిన బ్యాంకు లింకేజ్ లో మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చుటలో అద్భుతంగా రాణించిన ఎపియం, సిసిలు మరియు వివోఏలకు బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎపియం వెంకటేష్ మాట్లాడుతూ వంద శాతం కి పైగా లింకేజ్ ను సాధించుటకు కృషి చేసిన సిసి ,వివోఏ లకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి తో ఈ ఏడాది కూడ అద్భుతంగా రాణించి జిల్లా స్ధాయిలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశిష్(ఫీల్డ్ ఆఫీసర్ ) ముత్యాలరావ్, నవీన్, కేశవ్ (క్యాషియర్లు) సతీష్(అకౌంటెంట్) మరియు ఎపియం వెంకటేష్, సిసిలు S.రాజమల్లు,P.రాజమల్లు, P.లక్ష్మీ,N.శారదా , వివోఏ లు, ఎమ్మెస్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.