Digital Kasipet:-
మండలంలోని దేవాపూర్‌లో పాత అంగడిబజార్ వద్ద ఆదివారం
మరియు గురువారం జరగపోయే రెండు వారసంతల బహిరంగ వేలం జరగనుంది. 2022 - 2023 సంవత్సరానికి సంబందించి వేలం నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యాదర్శి కవిత పేర్కొన్నారు. వేలంలో పాల్లోనే వారు గ్రామ పంచాయితీకి ఎలాంటి బకాయిలు ఉండవద్దన్నారు. వేలం కొరకు 5వేల రూపాయలు డిపాజిట్ చేయాలని, వేలం అనంతరం 24 గంటల్లో 1/2 శాతం చెల్లించాలని, మిగితా సెప్టెంబర్ 2022లోపు చెల్లించాలని ఆమె సూచించారు. వేలంలో నెగ్గిన వ్యక్తి 24 గంటల్లో డబ్బు చెల్లించనిచో అతని డిపాజిట్‌ను జప్తు చేసి రెండవ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని, రెండవ వ్యక్తి కూడా సుముకత చూపకపోతే అతని అతని డిపాజిట్ కూడా జప్తు చేసి తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. వేలం కొరకు డిపాజిట్ 16వ తేది ఉదయం 11 గంటల వరకు చెల్లించిన వారికే వేలంలో పాల్గోనే అవకాశం ఉందని ఆమె తెలిపారు.