Digital Kasipet:-
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. కాసిపేట మండలంలోని పల్లంగుడ, చిన్నధర్మారం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మన ఊన-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చక్కగా చదు వుకునేలా పాఠశాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు.అనంతరం పల్లంగుడలో స్కూల్ కంపావుండ్ వాల్ కొరకు 15 లక్షలు,మరమ్మతులకొరకు 7.20 లక్షలతో భూమిపూజ చేశారు.అలాగే చిన్నధర్మారం స్కూల్ కు 6.50 లక్షలు, కొంపండ్ వాల్‌కు 10 లక్షలతో ప్రారంభించారు. ఈకారిక్రమమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు,ఎంఈఓ దామోదర్, సర్పంచ్ దుస్స విజయ, భుక్య సినీతా, ఎంపీటీసీ నవనదుల చెంద్రమవులి, కొండ బత్తుల రాంచెందర్, అక్కేపల్లి లక్ష్మి,దారావత్ దేవి, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, రంగు సతీష్, అశోక్ తెరాస కార్యదర్శి మోటూరి వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, తెరాస నాయకులు అగ్గి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.