Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కేంద్రం రైతుల వడ్లు కొనేంత వరకు ఉద్యమం విరమించేది లేదు

Digital Kasipet:- 
తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్లో   రైతులు పండించిన వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనేంత  వరకూ ఉద్యమం ఆపేది లేదని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  కేంద్రం రైతుల వడ్లు  కొన నందుకు మండల తెరాస పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేప ట్టింది. నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో కూడా రైతులకు రైతుబంధు, రైతుబీమా,కళ్యాణ లక్ష్మి  పథకాలు  అమలు కావడం లేదన్నారు. దేశంలో 100 మందిలో 87 శాతం  రైతులే ఉన్నారన్నారు. రైతులను ఆదుకునే పథకాలు కేంద్రం ఇప్పటి వరకు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నుండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం  వరకు ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సహాయం అందించ లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు రైతుల కష్టాలు స్వయంగా చూశాడన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం వల్ల పేద ప్రజలకు రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం సులువైదన్నారు. 


నిరుపేద గిరిజన దళిత కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే కల్యాణలక్ష్మి పథకం తెచ్చాడా న్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో  రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్, దేశ ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్  లో కూడా కల్యాణ లక్ష్మి, బంధు రైతు బీమా పథకాలు లేవన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ల కింద 700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా దేశం అభివృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ప్రజలు తెలంగాణలో కలపాలని ఆందోళన చేస్తున్నారన్నారు. తాను పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసాడని గుర్తు చేశారు. ను కొనుగోలు చేయకుండా దశలవారీగా ఆందోళన చేస్తామని, ఈనెల 11న ఢిల్లీ వెళ్లి నిరసన చేస్తామని అన్నారు. రైతుబంధు తీసుకొని రైతుల ఆందోళనలు పాల్గొనని బిజెపి కాంగ్రెస్ కు చెందిన వారిని రైతులు  నిలదీయాలని పిలుపునిచ్చారు.


 జడ్పిటిసి పల్లె చంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తడనే  భయంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అడ్డు పుల్లలు వేస్తుందని అన్నారు.


మండల ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు మాట్లాడుతూ  రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా   కలిసి అందరం  ఐక్యమత్యంతో పోరాడాలని అన్నారు. 


మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం  మాట్లాడుతూ లో రైతులు పండించిన వరి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ప్రయోజనం లేదన్నారు. వడ్లు  కొనుగోలు చేసేంత వరకు ఉద్యమం ఆపేది లేదని అన్నారు.


మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య మాట్లాడుతూ బిజెపి నాయకులు వేసవిలో వరి పండించాలని పిలుపునిచ్చి ఇప్పుడు వడ్లు కొనమని అనడం వారి ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు. కాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి  గద్దె ఎక్కడం ఖాయం అని తెలిసి  బిజెపి నాయకులు రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.


సోమగూడెం కే సర్పంచ్ సాపాట్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చేయడం వివక్షే నన్నారు.ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూక్యా  నీల, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, వాసుదేవ్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటురి వేణు, మండల కో ఆప్షన్ సభ్యులు శిరాజ్ ఖాన్, మండలంలోని సర్పంచులు, ఎమ్ పి టి సిలు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App