Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధి లో గల నాయక పు గూడలో ఆదివాసి సేవా నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల్లో అసువులు బాసిన ఆదివాసి అమరులకు ఘనంగా నివాళులు అర్పిం చడం జరిగింది వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా అడవి అధికారుల ఆగడాలు ఆపాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి లో 1981 ఏప్రిల్ 20 న బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభను ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం పోలీస్ ప్రజలపై దాడులు చేసి రెచ్చగొట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి అనేకమంది ఆదివాసి ప్రజలను పొట్టన పెట్టుకుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి ఆదివాసి బంధు ప్రకటించాలి. ఇందులో నాయకులు కొమ్ముల బాపు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి సండ్ర సైలజ మహిళా సంఘం కొమ్ముల రజిత ఎస్ ఎఫ్ ఐ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి మేకల సునీల్ కొమ్ముల సంజీవ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.