Digital Kasipet:-
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కరెంటు బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాసిపేట మండల రెవెన్యూ కార్యాలయం ముందు మండల బిజెపి పార్టీ అనుబంధ సంస్థ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు . విద్యుత్ చార్జీలు పెంచి బడుగు బలహీన వర్గాల పైన మోయలేని భారాన్ని మోపిన తెరాస ప్రభుత్వం,వెంటనే పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హె చ్చరించారు హెచ్చరిస్తున్నాము. తదనంతరం మండల తహసీల్దార్ దిలీప్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చాజిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్. బీసీ మోర్చా మండల అధ్యక్షులు శంకర్. మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పెరుగు రాజు. యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్. కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బాకీ సురేష. పంబాల అరవింద్. బాకీ కిరణ్. రవి.నవీన్. మల్లేష్. బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.