Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యార్థులు ఆత్మన్యూనతా భావం, భయం వీడి లక్ష్యంపై దృష్టి పెడితే విజయం సాధిస్తారు

Digital Kasipet:-
విద్యార్థులు తాము  గ్రామీణ ప్రాంతం నుండి వచ్చామని, ఆత్మన్యూనతా భావంతో ఉండడం వల్లనే వెనకబడి పోతున్నారని, భయం వీడి ధైర్యంగా చదివి లక్ష్యంపై దృష్టి పెడితే  పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండలం ధర్మారావుపేట జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలపై విద్యార్థులకు అవగాహన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  విద్య  నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, లక్ష్యం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు లక్ష్యం లేకుండా జీవించడం వల్ల ఏమి  సాధించలేకపోతున్నారు అని అన్నారు. అవయవాలు అన్ని సక్రమంగా ఉండి కూడా సాధించ లేని  వారు  రెండు చేతులు లేని కేరళకు చెందిన థామస్ ఎన్నో అద్భుతాలను సృష్టించిందని ఆమె  విజయ గాధను విద్యార్థులకు వివ రించారు. భయం వల్లనే ముఖ్యం గా విద్యార్థులు ఏమి సాధించలేక పోతున్నారు అని భయాన్ని వీడా లన్నారు. భయం పోవాలని విద్యా ర్థులకు బలరామకృష్ణులు రాక్షసు ల కథలను ఉదాహరణగా చెప్పా రు. విద్యార్థులు విజయం సాధిం చాలంటే  5P ఫార్ములాను, చెడు అలవాట్లకు దూరంగా కావాలని 4c ఫార్ములాను వివరించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు రావాలంటే  బట్టి పట్టకుండా విజు వలేషన్  ద్వారా చదవాలని సూచించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు, మండల ఇన్చార్జి విద్యాధికారి దామోదర్ మాట్లా డుతూ విద్యార్థులు మోటివేటర్ అర్జున్ చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకొని పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించాలని పదవ తరగతి విద్యార్థులను కోరారు. ఈసారి పదో తరగతి విద్యార్థులు బాసర ఐఐటి లో కనీసం పది సీట్లు అయినా  సాధించే లక్ష్యంతో చదవాలి అని కోరారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మంచి మెళుకువలు నేర్పేందుకు ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య వేదిక ను అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ మాట్లాడుతూ  విద్యార్థులకు చక్కటి మోటివేషన్ మెలికలు నేర్పిన అర్జున్ ను అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు నజీం మున్నీసా మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక ఏర్పాటు చేసిన మోటివేషన్ తరగతులు అద్భుతంగా ఉన్నాయని, మోటివేషన్ స్పీకర్ అర్జున్ గారు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాడు అని అభినందించారు. నిర్వాహకులు మరొకసారి మా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు ఇప్పించాలని కోరారు. 

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా కాలాన్ని,మనసును సరిగా వాడుకోవాలని సూచించా రు. మనిషి ఉన్నతికి పతనానికి ఇవే కారణమని అన్నారు.కాలాన్ని వృధా చేయవద్దని సరిగా వాడు కోవాలని అన్నారు. కాలం వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు దోచుకోవడంమే నన్న గౌతమ బుద్ధుని సూక్తుని గుర్తు చేశాడు. మనసు పై దృష్టి సారించాలని మనిషి ఉన్నతికి పతనానికి  మనసే  కారణం కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించి చైతన్య వంతులు చేయాలనే సంకల్పంతో  సామాజిక చైతన్య వేదిక  మోటి వేటర్ మద్దినేని అర్జున్ చే  తర గతులు ఇప్పించడం జరుగు తుందని అన్నారు. అర్జున్ బోధించిన విషయాలను గుర్తు పెట్టుకుంటే తప్పకుండా పరీక్షల్లో విజయం సాధిస్తారన్నారు.  సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ తాను పెద్దగా చదువు కోకున్న ఉపాధ్యా యుల సలహాలతో తన ఇద్దరు పిల్లలను బీఈడీ చేయించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చి దిద్దానని  అని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు  చెప్పిన  విషయాలను అర్థం చేసుకొని మంచిగా చదివి ప్రయోజకులు కావాలని కోరారు. మండలంలో  విద్యార్థులను, యువకులను చైతన్యపరిచి మంచి మార్గంలో తీసుకువచ్చేందుకు సామాజిక చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతి, భాగ్యలక్ష్మి సులోచన తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App