Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అంబేద్కర్ సంఘన్ని మండలంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలి

Digital Kasipet:- 
అంబేద్కర్ భావజాలాన్ని కాసిపేట మండలంలోని అన్ని గ్రామాలకు వ్యాప్తి చెందాలంటే అన్ని పంచాయతీ లో కమిటీలు వేయాలని మండల శాఖ అధ్యక్షుడు రాంచందర్ అన్నారు. ఆదివారం కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ ఎన్నిక కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముత్యం పల్లి గ్రామం గత 30 సంవత్సరాలుగా అంబేద్కర్ భావజాల వ్యాప్తి లో ముందు ఉందని అన్నారు. మండలంలోనే మొట్ట మొదటి సారిగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి గ్రామం లో సారా వ్యతిరేక పోరాటం, మహనీయుల జన్మదిన సందర్భంగా గ్రామంలో కాగడాల ప్రదర్శన లు కూడా చేయడం జరిగిందని అన్నారు. అంబేద్కర్ సంఘం లోకి యువకులు పెద్ద ఎత్తున చేరి అంబేద్కర్ భావ జాలాన్ని ప్రచారం చేయాలని కోరారు. సంఘ విస్తరణ కు  మండల నాయకులు సమయం కేటాయించాలని కోరారు. ముత్యం పల్లి సర్పంచ్ కమిటీ గౌరవాధ్యక్షుడు ఆడే బాదు మాట్లాడుతూ అంబేద్కర్ సంఘం లో అన్ని కులాల తో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. అంబేద్కర్ సంఘానికి తాము పూర్తి సహకారం అంది స్తామని తెలిపారు. ముఖ్య సలహాదారులు   పల్లె మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ పూలే ఆలోచనా విధానమే బహుజనుల విముక్తి మార్గం అని నేటితరం  అంబేద్కర్ ను చదివి అతని భావజాలాన్ని ప్రచారం చేయాలని కోరారు. అగ్రవర్ణ పెత్తందార్ల ప్రలోభాలకు లొంగి వారికి అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని కోరారు. సమాజంలో 80 నుండి 90 శాతం ఉన్న బహుజనులను ఐక్యత లేకపోవడం వల్లనే నుండి 10 శాతం ఉన్న అగ్రవర్ణాల రాజాధికారం చేజిక్కించుకొని మనలను పాలిస్తున్నాయి అని అన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం ఐక్యమత్యమే అంబేద్కర్ ఆలోచనతో ముందుకు పోవాలని సూచించారు.
 సలహాదారు దాసరి రాజన్న మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘంలో యువకుల ఆమె కాకుండా అందరం ఉన్నామని సంగం పేరు మార్చేందుకు సమీక్ష చేయాలని అన్నారు. అంబేద్కర్ సంఘంలో అన్ని వర్గాలు చేరుతుండటం వల్ల అంబేద్కర్ సంఘాన్ని బహుజన అంబేద్కర్ సంఘం గా మార్చాలని  సూచించారు. అంబేద్కర్ సంఘం గ్రామాల్లో విస్తరించాలంటే ముందు రంగనాయకులు స్వార్థం పోవాలని అన్నారు. సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు మాట్లాడుతూ మండలంలోని అంబేద్కర్ సంఘాన్ని అన్ని వర్గాలను కలుపుకుని ఏర్పాటు చేయడం ఇతర సంఘాల ఆదర్శమని అన్నారు. అంబేద్కర్ సంఘం ఎన్నికైన కమిటీ అంబేద్కర్ భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేయాలని అన్నారు. ముత్యం పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. విగ్రహాన్ని అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు  కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. ఉపాధ్యక్షుడు రామిళ్ళ కిష్టయ్య  మాట్లాడుతూ
 మండలంలో అంబేద్కర్ సంఘం  విస్తరించడానికి ముత్యం పెళ్లి కేంద్రమని ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య మాట్లాడుతూ  అంబేద్కర్ సంఘాన్ని అన్ని వర్గాల ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్ మాట్లాడుతూ బహుజనుల కోసం అంబేద్కర్  తమ జీవితాన్ని త్యాగం చేసాడని అతడి త్యాగాలను మనం వృధా చేయకుండా ఇద్దరము ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మండల కమిటీ ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాల వ్యాప్తి లో అందరము కలిసి మెలిసి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రంగం లో విభేదాలు కాకుండా నాయకులంతా సంయమనంతో ముందుకు వెళ్లాలని అన్నారు. సమావేశంలో   దాసరి లింగయ్య, కాంపల్లి వెంకటేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ  సలహా దారు  లంక లక్ష్మణ్, నల్ల సంయుక్త కార్యదర్శి  దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

ముత్యంపల్లి అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ ఎంపిక.
 అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా గొడిసెల భీమయ్య,గౌరవ అధ్యక్షులుగా   సర్పంచ్ ఆడే బాదు , ప్రధాన కార్యదర్శిగా , మల్లెతుల సందీప్, ఉపాధ్యక్షులుగా గొడిసెల అజయ్, ఆవుల ఫ్రాన్సిస్,  కార్యనిర్వాహక అధ్యక్షులుగా  పెద్రం శంకర్,జాడి రాజ్ కుమార్  సంయుక్త కార్యదర్శిగా గొడిసెల మహేందర్, చొప్పదండి ఎల్లయ్య, ప్రచార కార్యదర్శి గా చొప్పదండి నరేష్, ఆడే లక్ష్మణ్, కార్యదర్శులుగా పుట్ట శ్రీను, శిరాజ్ ఖాన్, కోశాధికారిగా దాసరి సతీష్  ముఖ్య సలహాదారులు గా జాడి చిన్న పోశం, దాగం బాపు, దాసరి లింగయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నికల కార్యక్రమానికి  మండల అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు రామిళ్ళ కిష్టయ్య, అగ్గి సత్తయ్య, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, దాసరి శంకర్ సలహాదారులు పల్లె మల్లయ్య దాసరి రాజన్న, దేవాపూర్ కమిటీ కార్యదర్శి కాంపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App