Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం సమావేశం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని మద్ది మడ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం కాసిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 24న ఆదివాసీల హక్కులకోసం పోరాడి అసువులు బాసిన అమరుడు చేనేని భీమయ్య వర్ధంతి కార్యక్రమం గురించి చర్చించి, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా పూజా కార్యక్రమాలు సభా నిర్వహణ ప్రణాళిక చేసి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజలు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రోడ్డ  లక్ష్మి, మాజీ సర్పంచ్ రోడ్డ రమేష్, ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, రోడ్డ గోపాల్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బద్ది శ్రీనివాస్, ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం మండల అధ్యక్షులు నాయుడు మల్లేష్, బద్రి శ్రీనివాస్, మద్ది మాడ గ్రామ కమిటీ అధ్యక్షులు సోమని పోసక్క, మహిళ కార్యదర్శి భీమిని మహేందర్, మండల ఉపాధ్యక్షులు రెడ్డి లక్ష్మణ్, సాంస్కృతిక కార్యదర్శి  రాజన్న, ప్రధాన కార్యదర్శి బైరినేని మల్లేష్, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App