Digital Kasipet:-
ఆదివాసుల ఆరాధ్య దైవాల అయినా సమ్మక్క సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి అరెస్టు చేయాలని కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలో తుడుం దెబ్బ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం జరిగింది. చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం తెలుగు దెబ్బ జిల్లా నాయకుడు ఆత్రం జంగు మాట్లాడుతూ సమ్మక్క - సారలక్క లు పకృతి దేవతలని ప్రతి రెండేళ్లకు కోట్లాది మంది భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు అని అన్నారు. మీలాగా విగ్రహాల పేరిట ప్రజలను దోచుకోరాని, వ్యాపారం చేయారని విమర్శించారు. భారతదేశ చరిత్రలో శాస్త్రీయ మూలాలకు కేంద్రంగా అయిన శక్తిపీఠాలను ఆలయాలను ఆధ్యాత్మిక శక్తులు గా మార్చి వ్యాపారం చేసే బ్రాహ్మణీయ సంస్కృతి ఆదివారం సమాజాన్ని ధ్వంసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదివాసీల ఆత్మ గౌరవ పక్షాన నిలబడి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు కనకరాజు, జంగు, రమేష్, వెంకటేష్, టిఆర్ఎస్ దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు అట్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.