Digital Kasipet:-
ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి అటవీశాఖ కాసిపేట మండలంలోని ముత్యం పల్లి పాఠశాలలో విద్యార్థులకు అడవి రక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి అటవీశాఖ రేంజ్ అధికారి సుభాష్ మాట్లాడుతూ అడువుల వలన కలిగే ప్రయో జనాలు వర్షాలు, వాతావరణ సమతుల్యత, భూమి వేడెక్కడం, ఆక్సిజన్ లభ్యత, అడవులు అంతరించి పోవడం వలన జరిగే నష్టాలు గురించి వివరించారు. ప్రపంచ దేశాలన్నీ అడవులు రక్షణకై పాటుపడుతున్నాయ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో అందరూ ప్రతీ ఒక్కరు పాలుపంచుకోవాలని అన్నారు.వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహరించాలని ఆయన కోరారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉప న్యాస పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం పల్లెల్లలో పెంచుతున్న పల్లె ప్రకృతి వనాల ఆవశ్యకత గురించి ముత్యంపల్లి పల్లె ప్రకృతి వనాలకి విద్యార్థులను తీసుకెళ్ళి వివరించారు.ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్, బెల్లంపల్లి Dy R O గౌరీ శంకర్ , fbo రాజేష్, పాఠశాల ఉపాధ్యాయలు పుష్పలత,శాంకరీ, జ్యోతి, కృష్ణగోపాల్, మాదవి లత, అనసూర్య, విద్యార్థులు పాల్గొన్నారు.