Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం తెలంగాణ జన సమితి 2 వ ప్లీనరీ వాల్ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు గోనెల శ్రీనివాస్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ అమరుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందన్నారు.ఉద్యోగ ఉపాధి కల్పన విధానం రూపొందించ కుండా నిరుద్యోగ భృతి చెల్లించకుండా విద్య వైద్య రంగాలకు ప్రణాళికలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకురాలు శ్రీ లత, మరియు సంజీవ్, తిరుపతి, సయ్యద్ మీర్, అకుంస్, తదితరులు పాల్గొన్నారు.