Digital Kasipet:-
తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళవారం కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో కృషి చేసిన100 మహిళలకు సన్మానము చేయడం జరిగింది. సన్మాన కార్యక్రమం మండల ఎంపిపి అధ్యక్షురాలు రొడ్డ లక్ష్మి నిర్వహించారు. మండలంలోని ఎం పి టీ సి లు సర్పంచులు టీచర్స్ అంగన్వాడీ టీచర్స్. మొత్తం 100 మంది కీ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఉన్నతు లుగా ఎదగాలని మహిళలు చదువు కొంటె సమాజం సన్మా ర్గంలో పయనింప చేస్తారని అన్నారు. మండల అధ్యక్షులు శ్రీమతి రొడ్డ లక్ష్మి ని రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు అక్కల తిరుపతి వర్మ జిల్లా సాహితి అధ్యక్షులు రాజేశంగౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు మేడి రాజశేఖర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్, మండల జాగృతి మహిళా అధ్యక్షులు బద్ది సుగుణ జిల్లా పి ఆర్ ఓ చిన్నయ్య జాగృతి నాయకులు అరుణ డి కే బోస్, గంగాధరి రాజ్ కుమార్, కనక వంశీ కృష్ణ, కనుకుంట్ల హరీష్, దుర్గం శేఖర్, సూరం వినోద్ కుమార్, పెద్దపల్లి శ్రీవాణి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.