Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టీజేఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం

Digital Kasipet:- 
భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామంలో తెలంగాణ జన సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా నాయకులు గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి 
మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. మహిళలకు చదువు నేర్పేందుకు పాఠశాలలు తెరిస్తే అప్పటి మనువాదులు  ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని , పేడ  నీళ్లు చల్లారని అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న భర్త జ్యోతిరావు పూలే అండదండలతో కోసం పాఠశాల నడిపించిన మహనీయురాలని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా పని చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన ధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  దుబ్బగూడెం వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత, మండల  వికలాంగుల సంఘం అధ్యక్షుడు బోగే పోశం, దుర్గం శ్రీనివాస్, దుర్గం సంజీవ్, రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App