Digital Kasipet:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పల్లం గూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతు పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఎన్నో హక్కులు రాజ్యాంగంలో కల్పించిన, రిజర్వేషన్ల వల్ల పదవులు వచ్చిన వెచ్చగా పనులు చేయలేక పోతున్నారన్నారు. దీనంతటికీ ప్రధానమైన మూలం బ్రాహ్మణీయ మనువాద భావజాలం లోనే ఉందని అన్నారు. భారతదేశంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు హాయంలో మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవని బిక్కు మహిళ సంఘాల ద్వారా గ్రామాలలో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసే వారన్నారు. దేశంలో బ్రాహ్మణీయ మనువాద ప్రవేశంతో మహిళలకూ స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా పోయాయన్నారు. బుద్ధుడి తర్వాత సుమారు 2000 సంవత్సరాల తరువాత అంబేద్కర్ వచ్చి మహిళల హక్కుల కోసం ఆలోచించి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించాడు. హిందూ కోడ్ బిల్లు ప్రవేశ పెట్టాడు అని అన్నారు. రాజ్యాంగం ద్వారా 50 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మహిళలకు పదవులు వచ్చిన వారిపై పురుషులు పెత్తనం చెలాయిస్తూ ఇండ్లకి పరిమితం చేశారన్నారు. విధానం మారాలంటే మహిళలు స్వేచ్ఛగా మాట్లాడడం నేర్చుకో ని పదవులకు న్యాయం చేయాలని అన్నారు. నేడు గ్రామాలలో మహిళా సంఘాలు రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారం చేయడానికి పరిమితం కాకుండా స్వయం ఉపాధి పై దృష్టి సారించాలని అన్నారు. ప్రాంతంలో లభించే ఇప్పపువ్వు సేకరించి లడ్డూలు తయారు చేస్తే ఆదాయం వస్తుందని సూచిం చారు సమావేశానికి అధ్యక్షత వహించిన సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని , శ్రమ దోపిడీ నుండి విముక్తి కోసం పోరాడిన ఫలితంగా ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరపాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించిందన్నారు. హిందూ సమాజం మహిళల ఇంటికే పరిమితం చేసి బాల్యంలో తల్లిదండ్రుల పై, యవ్వనంలో భర్త పై, వృధ్యాప్యంలో కొడుకుల పై ఆధారపడి జీవించేలా మనుధర్మ శాస్త్రం లో చెప్పిందన్నారు. మహిళలు చైతన్యవంతం అయితే కుటుంబాలు బాగుపడతాయి అని అన్నారు. సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ ప్రతి మహిళ ధ్యానం చేయాలని ధ్యానంతో ఆరోగ్యము, కుటుంబాలలో ఆనందం వస్తుందన్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా అందరితో మంచిగా మాట్లాడటం నేర్చుకో వాలని అన్నారు. సహాయ కార్యదర్శి మెయిన్ డ్రాప్ రాజన్న మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక ద్వారా మహిళలను చైతన్యవంతం చేసేందుకు మహిళ దినోత్సవాలు జరుపుతున్నామ న్నారు. తదనంతరం గ్రామ సర్పంచ్ విజయ కేక్ కట్ చేసారు. గ్రామంలోని నలుగురు మహిళలకు మాజీ ఎంపీటీసీ తాండూరు భూమక్కా, బద్ది లలిత, చిన్నవేణి రాజేశ్వరి, కొండా రాజక్క లను సర్పంచ్ విజయ శాలువాలతో సన్మానించారు. మహిళా సంఘాల నాయకులతో సర్పంచ్ విజయ ను శాలువాతో సన్మానించడం జరిగింది.