Digital Kasipet:-
మందమర్రి ఏరియా కాసిపేట 2 గని ఆవరణలో మంగళవారం గనిలో విధులు నిర్వర్తించే రెస్క్యూ సభ్యులను గానీ అధికారులు సన్మానించారు. ఇటీవల ఆడ్రియాలా లాంగ్వాల్ మైన్ లో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను రక్షించేందుకు కాసిపేట గని లో విధులు నిర్వర్తించే రెస్క్యూ సిబ్బంది ప్రదీప్ ఎలక్ట్రిషన్, కార్తికేయ మైనింగ్ సర్దార్, అశోక్ బాబా జనరల్ మజ్దూర్, వంశీకృష్ణ సపోర్ట్ మెన్ లు లాంగ్వాల్ ప్రాజెక్టు కు వెళ్లారు. అందులో ముగ్గురు కార్మికులను ప్రాణాలతో రక్షించారు. బొగ్గు పెల్లల కింద కూరుకుపోయి మృతిచెందిన ఇద్దరు అధికారులు, కాంట్రాక్టు కార్మికుడు శవాలు అతికష్టంగా బయటికి తీశారు. రేస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రదీప్ గని లో జరిగిన సంఘటనలను కార్మికులకు వివరించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బండ కింద కి వెళ్లి ప్రమాదం లో గాయపడ్డ వారిని కాపాడామని, చనిపోయిన అధికారుల శవాలను కూడా అతికష్టంగా బయటకు తీసామని తెలిపారు. ఈ సందర్భంగా గాని మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ భూకంపాలు తుఫానులు లాంటి పకృతి విపత్తులలో ప్రజలను కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగి కాపాడుతుందని అన్నారు. గని ప్రమాదాలలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగుతారని తెలిపారు. కఠిన శిక్షణతో పాటు ధైర్యసాహసాలతో పాటు ప్రాణాలకు తెగించి రేస్యు సిబ్బంది ప్రమాద ఘటన లో పాల్గొని కార్మికులను రక్షిస్తారని కొనియాడారు. వీరి సేవలకు గౌరవం ఇవ్వాలని కార్మికులను కోరారు. తదనంతరం ఇంజనీరు రఘు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నలుగుర్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి, సంక్షేమ అధికారి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.