Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వర్డ్ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామా...

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని మామిడి గూడా గ్రామపంచాయతీలో గురువారం వర్డ్ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ ఎంఏ అలీం కి అందజేశారు. ఈసందర్బంగా వార్డ్ సభ్యులు మాట్లాడుతూ గ్రామసభలో అభివృద్ధి పనులు, మిగిలు నిధుల గురించి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పక దాటవేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా అడగగా వర్డ్ సభ్యుల తీర్మానం లేకుండా బిల్లులు చేశారన్నారు. ఎలాంటి పనులు చేయకుండా బిల్లులు చేసుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు తిరుపతి,  లలిత, రమేష్, రాజేశ్వరి, శ్రీకాంత్, వనజ ఉన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App