Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం కాసిపేట లోని వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్నారు. వేసవి కాలంలో రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రికి లేఖ వ్రాస్తూ గ్రామ సభ నుండి తీర్మానాలు చేశారు. కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ దరావత్ దేవి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి కి లేఖ రాసి తీర్మానం చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి , ఉపసర్పంచ్ పిట్టల సుమన్ , తెరాస గ్రామ అధ్యక్షులు అగ్గి సత్యం , మరియు గ్రామ వార్డ్ సభ్యులు తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.