Digital Kasipet:-
కాసిపేట మండలం కోమటి చేను గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త వరిపేట గ్రామంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ నిర్వహించింది. గ్రామంలోని ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను జడ్పిటిసి పల్లె చంద్రయ్య, సర్పంచి రామటెంకి శ్రీనివాస్, ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్, ఉప సర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు కుమ్మరి శేఖర్, వార్డు సభ్యులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు .