Digital Kasipet:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాసిపేట మండలంలో వివిధ గ్రామాల్లో వివిధ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ధర్మ రావు పేట లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి సుధాకర్ రెడ్డి శాలువతో సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ నర్స్ ప్రమీల ను యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో వంద మంది మహిళలను సన్మానం చేశారు. సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పల్లగూడెం పంచాయతీలో సర్పంచ్ విజయ తోపాటు ఐదుగురిని సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, సహాయ కార్యదర్శి మెండ్రపు రాజన్న తదితరులు పాల్గొన్నారు.