Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అర్హులైన పేదలకు మాత్రమే దళితబంధు ఇవ్వాలి - బీజేపీ

Digital Kasipet:- 
అర్హులైన పేదలకు మాత్రమే దళిత బంధు పథకం అందజేయాలనీ తహసిల్దార్ కి కాసిపేట మండల బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు.  రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజవర్గం కి 100 మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ పథకం దళిత బంధు కాదని టిఆర్ఎస్ పార్టీ బంధు అని బీజేపీ నాయకులు ఏద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు మరియు కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు అందుతుందని, నిజమైన పేదవారికి దళిత బంధు అందడం లేదని విమర్శించారు. దీనిని భారతీయ జనతాపార్టీ  తీవ్రంగా ఖండిస్తుందని, అర్హులైన పేదవాడికి దళిత బంధు అందకపోతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్క పురం రమేష్, కాసిపేట మండలం యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పెరుగు రాజు, దాగం  లీల, దుర్గం దుర్గయ్య, బాకీ నరేష్, బాకీ సురేష్, కంబాల హనుమంతు, వేల్పుల నవీన్, తదితర నాయకులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App