Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

Digital Kasipet:-
అంబేద్కర్ యువజన సంఘం అన్ని కులాల వారిదని, మండల ప్రజలు ఆదరించి కమిటీల ఏర్పాటుకు సహకరించాలని అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్ కోరారు. ఆదివారం కాసిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో కాసిపేట గ్రామ కమిటీ ఎన్నిక కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్  కేవలం ఎస్సీలకు పరిమితం అయ్యాడనే అపోహలు తొలగించుకు నేందుకు మండల శాఖ  నూతన పద్ధతిలో అన్ని వర్గాలను కలుపుకుని కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంద న్నారు. ముఖ్య సలహాదారు అంబేద్కర్ వాది మండల కేంద్రంలో మొట్టమొదట అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన బన్న  ఆశాలు మాట్లాడుతూ మండలంలోని బహుజనుల మంత ఐకమత్యంతో ఉండాలని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు. 
 ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం విస్తరణలో అన్ని వర్గాలు కలిసి రావాలని  నిచ్చారు. ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని దేవాపూర్ లో పెద్ద ఎత్తున జరిపేందుకు గ్రామ కమిటీ నిర్ణయం తీసుకుందని మండల శాఖ దానికి సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వాహకులు సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు మాట్లాడుతూ అంబేద్కర్ వాదుల మంతా కలుసుకున్నప్పుడు ఇక నుంచి' నమస్తే 'కు బదులు 'జై భీమ్' అనుకోవాలని సూచించారు.మండల అంబేద్కర్ సంఘం నాయకుడు అగ్గి స్వామి మాట్లాడుతూ  మండల కేంద్రంలో  బుద్ధుడి విగ్రహం తన సొంత  ఖర్చులతో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అంబేద్కర్ యువజన సంఘం తనకు సహకరించాలని కోరారు. పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన దాడి పెంటయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎన్నిక చేసినందుకు మండల కమిటీ కి కృతజ్ఞత తెలుపుతూనన్నారు. అనంతరం జాడి రామచందర్ ఆధ్వర్యంలో మండల కమిటీ నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు దాడి పెంటయ్యను శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యక్షుడు ఆగ్గి సత్తయ్య, సంయుక్త కార్యదర్శి అక్కపెళ్లి  బుగ్గ రాజు, గొడిసెల సురేందర్, దాగం రాజలింగు దేవాపూర్ గ్రామ కమిటీ కార్యదర్శి కాంపెళ్లి  వెంకటేష్ తదితరులు  పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App