Digital Kasipet:-
విద్యార్థులు పరీక్షల సమయంలో మనల్ని మనం ప్రోత్సహించు కుంటూ ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధిస్తారని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ విద్యార్థులకు తెలిపారు. శనివారం కాసిపేట మండలం దేవాపూర్ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా సంసిద్ధత కావాలనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య నేర్చుకోవడం వల్లనే సమాజంలో గౌరవం లభిస్తుందని విద్యార్థులు నిరంతరం చదువుకుంటూనే ఉండాలని అన్నారు. ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా చదువుతే తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. లక్ష్యం పెట్టుకుని జీవించేవారు లీడర్ అవుతారని, అక్షరం లేకుండా తిరిగే వారు లేబర్ గా మిగులుతారని విద్యార్థులకు తెలిపారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. మనిషి ఉన్నతికి, పతనానికి ప్రధాన కారణం మనసే కారణమని అన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ విద్యార్థులు సమయం వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని చదివితే తప్పకుండా విజయం సాధిస్తార న్నారు. ఈ సమావేశంలో సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య . ఆదివాసి నాయకుడు రాందాస్, సామాజిక చైతన్య వేదిక సభ్యుడు మోహన్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు పద్మా,గంగాదేవి మంగ, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.