Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండలం లో హోలీ సంబరాలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో  ప్రజలు శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. సోనాపూర్, ఘట్ రావుపల్లి, వెంకటాపూర్, రొట్టె పెళ్లి  పంచాయతీల పరిధిలోని గిరిజన గూడాల లో  గురువారం రాత్రి నుండి సంప్రదాయబద్దంగా డోల్ వాయిస్తో  నైవేద్యం  పెట్టి కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం రంగులు పూసుకుంటూ యువకులు సంబరాలు జరుపుకున్నారు. గిరిజన గ్రామాలలో యువకులు  డప్పులు వాయిద్యాలతో పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ విరాళాలు సేకరించారు. సింగరేణి, ఓరియంట్ సిమెంట్ పరిశ్రమలకు   ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం తో  కాసిపేట ముత్యం పల్లి, దేవాపూర్ లలో కార్మికులంతా రంగులు పూసుకుంటూ  హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొండాపూర్ మల్కపల్లి, కోనూరు, కోమటి చేను  ధర్మారావుపేట్ గ్రామాలలో విద్యార్థులు, చిన్నారులు రంగుల సీసాలు పట్టుకొని చల్లుకుంటూ వీధుల్లో తిరుగుతూ హోలీ సంబరాలు చేసుకున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App