కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీశాఖ సెక్షన్ పరిధిలోని చిక్రమ్ గూడా,రొట్టెపెళ్లి గ్రామాలలో శనివారం అటవీ అధికారులు అడవిని కాపాడుకుందాం, అటవీ జంతువుల ను రక్షించుకుందాం అంటూ ప్రచారం నిర్వహించారు. వేసవికాలంలో చెట్లు ఆకు రాలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాటి నుండి అడవులను కాపాడుకోవాలని సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్ గ్రామస్తులకు తెలిపారు. అడవులలో అగ్ని వల్ల విలువైన వృక్ష సంపద కాలిపోతుం దని, అడవి జంతువులు పక్షుల గూళ్ళు అన్ని అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అటవీ ప్రమాదాల నుండి జంతువులను రక్షించాలని, దాహార్తి కోవడం కోసం గ్రామాల్లోకి వస్తే వాటికి ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అడవులను కాపాడుకోవాలి అటవీ జంతువులకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ విడుదల చేసిన పోస్టర్ లను లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, అటవీ బీట్ అధికారి రాజేష్, టిఆర్ఎస్ నాయకుడు ఆల్క పెద్దులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ముత్యoపల్లి సెక్షన్ పరిధిలో చిక్రం గూడ, రొట్టేపల్లి గ్రామాల్లో శనివారం అధికారులు అడవి లో నిప్పు, అడవి జంతువులను సంరక్షించడం పైన అవగాహన కల్పించారు.వేసవి కాలం వచ్చేసినందున అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవాకాశాలు ఉంటాయని, వాటి నుండి అడవులను కాపాడుకోవాలని , దాహార్తి తీర్చుకోడానికి అడవి జంతువులు గ్రామాల్లో కి వస్తే వాటికి ఎలాంటి ఇబ్బందులూ పెట్టకూడదని, అడవులలో అగ్ని వల్ల విలువైన వృక్ష సంపద కాలిపోతుందని, అడవి జంతువులు, పక్షుల గుళ్ళు, అన్ని అంతరించి పోయే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.