Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దేవాపూర్, లంబడి తండా (డి) లో రోడ్ల పనులు ప్రారంభం

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీలో, లంబడి తండా( డి ) గ్రామాల్లో  15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రోడ్లను  ప్రారంభించారు . దేవాపూర్ లో 10 లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్ల పనులను  ఎంపీపీ రోడ్డ లక్ష్మి కొబ్బరికాయ కొట్టి  పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, గ్రామ   కమిటీ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి , మండల పార్టీ నాయకులు గడ్డం పురుషోత్తం, అనంతరావు,మట్టపల్లి శ్రీనివాస్ రోడ్డ రమేష్, జె. సత్యం, వార్డు సభ్యులు శ్రీ రామ్ శంకర్, కైలాస్ గద్దల నవీన్, కే సతీష్, రెహమాన్ భీమయ్య,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

లంబాడి తండ (డి ) పంచాయితీలో....

 లంబాడి తండా పంచాయతీ పరిధిలోని పెద్దతండ గ్రామంలో  5 లక్షల  నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల సుధాకర్ రెడ్డి, ఉప  సర్పంచ్ అజ్మీర రాజు, కొండాపూర్ సర్పంచ్ మొక్కల శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, లావుడియా సక్రియ, bukya నానో అజ్మీర శంకర్, గణేష్, హిరా, రవి, ముఖ్య దేవుల, అజ్మీరా దేవీలాల్,రంగు రమేష్ మక్కల  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App