Digital Kasipet:-
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాల అయినా సమ్మక్క సారక్క లను అవమానపరిచే విధంగా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాసిపేట మండలంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
13 వ శతాబ్దంలో.. నాటి కాకతీయ సామ్రాజ్యంలో ఆత్మగౌరవం కోసం, న్యాయమైన హక్కుల కోసం పోరాడిన వీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. తెలంగాణలోని కోట్లాది మంది శ్రామిక వర్గ ప్రజలు ఆరాధించే సమ్మక్క-సారలమ్మలని అవహేళన చేస్తూ చిన జియ్యరు స్వామి మాట్లాడడం అగ్రకుల అహంకారం తో వున్న మనువాద బ్రాహ్మణుల కు తగదు.
సమ్మక్క-సారలమ్మ పేరుతో బిజినెస్ నడుస్తున్నదని చిన్న జీయరు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. సమ్మక్క సారలమ్మ జాతరలో ఒక్క రూపాయి కూడా టిక్కెట్లు లేకుండా దర్శనమిస్తారు. రామానుజ విగ్రహం పేరుతో తెలంగాణలోని అమాయక రైతుల భూములను తక్కువ రేట్ లో Lకొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూన్న నీకు మాట్లాడే అర్హత లేదు.సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించడానికి 150 రూపాయల టికెట్ పెట్టి వ్యాపారం చేసే పక్క బిజినెస్ మేన్ వి నీవు.
తక్షణమే సమ్మక్క-సారలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గిరిజన దేవతా మూర్తులను అవమానిం చిన చిన్న జీయర్ పై SC/ST Act కేసు నమోదు చేసి.. చట్టప్రకారం శిక్షించాలని కాసిపేట మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జాడి రామచందర్, సామాజిక ప్రజా స్పందన వేదిక అధ్యక్షులు శిలోజు మురళి, నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, మండల శాఖ అధ్యక్షులు బద్ది శ్రీనివాస్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు గోనెల శ్రీనివాస్, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.