Digital Kasipet:-
కాసిపేట మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం సీపీఎం అనుబంధ సి ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన దూలం శ్రీనివాస్ సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తుందని కార్మిక, కర్షక, ప్రజలపై మూకుమ్మడి దాడిని చేస్తుందని విమర్శించారు . ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్న బిజెపి మోడీ ప్రభుత్వానికి కళ్లెం వేయడానికి కార్మిక, కర్షక, ప్రజల ఐక్య పోరాటాలే ఆయుధంగా పనిచేస్తాయన్నారు . దేశ వారసత్వ సంపదను కారుచౌకగా అమ్ముతూ, దేశ దరిద్రానికి కారణమవుతూ మరోపక్క కార్మిక చట్టాలను మారుస్తూ లేబర్ కోడ్ ల పేరుతో కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చాలని చూస్తున్నా బిజెపి మోడీ ప్రభుత్వానికి ఈ సమ్మె సమ్మెట దెబ్బగా మారుతుందని తెలియజేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ, నిత్య అవసర సరుకుల ధరలను నియంత్రణ లేకుండా పెంచుతూ మెజార్టీ వర్గ ప్రజల బాధలను, కష్టాలను చూసి రాక్షస ఆనందం పొందుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ కార్మిక, కర్షక, ప్రజల పోరాటాలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతా రన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకొని ప్రజా పాలనను కొనసాగించి, కార్పొరేట్ పాలనను అంతం చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో స్వాతంత్ర పోరాట తరహాలో ఈ ప్రభుత్వాలపై పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. 28,29 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో మొదటి రోజు విజయవంతానికి కారణమైన కార్మిక, కర్షక, ప్రజలకు సిఐటియు విప్లవ జేజేలు తేలియ చేశారు. నిరసన కార్యక్రమంలో ఇరిగిరాల నారాయణ, చిన్నయ్య, రాజం, భిమేష్, మల్లయ్య, విజయ్, బక్కమ్మ, సత్తక్క, లక్ష్మి, రాజమ్మ, నర్సమ్మ, ఎల్లయ్య గార్లు పాల్గొన్నారు.