Digital Kasipet:-
కాసిపేట మండలంలోని బుగ్గ గూడెం పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెంలో గురువారం ఎన్ ఆర్ జి ఎస్ నిధులు ఐదు లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. పనులను గ్రామ సర్పంచి ఏదుల విజయలక్ష్మి, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, ఉప సర్పంచి రఘుపతి, కాసిపేట ఉప సర్పంచి పిట్టల సుమన్, వార్డు సభ్యులు ఏదుల మొగిలి ఎద్దుల అంజన్న టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడ్రాపు రాజన్న , టిఆర్ఎస్ నాయకులు అంజన్న తదితరులు పాల్గొన్నారు.