Digital Kasipet:-
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణ దాతలు గా నిలవాలని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ఎన్జీవో సూపర్వైజర్ రాకేష్ ప్రజలను కోరాడు. కాసిపేట మండలం తహసిల్దార్ కార్యాలయ సమీపంలో గురువారం జన జాగృతి కల్చరల్ బృందం ఆట పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలలో, పట్టణాలలో ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడ్డ సందర్భాల్లో తీవ్రంగా రక్తస్రావం జరిగి రక్తం దొరకక చాలామంది మరణిస్తున్నారు. రక్త దానం చేస్తే బలహీన పడతామని అపోహ ప్రజల్లో ఉంది. రక్త దానం చేస్తే ఎలాంటి నష్టం లేదని 8 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఆరోగ్యవంతులైన యువకులు సంవత్సరంలో మూడు సార్లు రక్తదానం చేయొచ్చని కళాజాత బృందం బృందం పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. యువకులు అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకునే ఎయిడ్స్ బారిన పడొద్దుని కోరారు. యువకులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం సక్రమ క్రమమైన మార్గంలో పయనించాలని కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాకేష్ తో పాటు లింక్ వర్కర్ రాజేశ్వరి, గ్రామస్తులు ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు. ఉపసర్పంచ్ బోయిన తిరుపతి పాల్గొన్నారు. జన జాగృతి కల్చరల్ కళాబృందం లో లీడర్ గణేష్ కళాకారులు నరేష్ కోట ఆదిత్య, డబ్బు గౌతం హరిప్రియ పాల్గొన్నారు.