Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పోగుల శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్యే చిన్నయ్య ఆర్థిక సహాయం

Digital Kasipet:- 
కాసిపేట మండలం రొట్టె పల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన  పోగుల    శ్రీనివాస్ కుటుంబాన్ని మంగళవారం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. ఆటో నడుపుతూ జీవనం సాగించిన శ్రీనివాస్  గత నెలలో ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చిన్నయ్య పరామర్శించి  10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే వెంట  స్థానిక సర్పంచ్ కవితహన్మంతు, యంపి పి రొడ్డ లక్ష్మిరమేష్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ యం పి పి విక్రంరావ్,  కమిటీ డైరెక్టర్ మంజూల రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, గ్రామ అద్యక్షుడు అల్కా పెద్దులు,మండల ప్రజప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App