Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సోనాపూర్ లో ' ఆయుష్ గ్రామ' కార్యక్రమం

Digital Kasipet:-  
కాసిపేట మండలంలోని సోనాపూర్ గ్రామంలో ' ఆయుష్ గ్రామ'  కార్యక్రమం గురువారం నుండి  కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను  ఆరోగ్యవంతులను చేయడం, రోగాల బారిన పడిన వారిని  అనారోగ్యాల నుండి  కాపాడేం దుకు  కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆయుష్ మిషన్ పథకం కింద 'ఆయుష్ గ్రామ' కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో  చేపట్టింది. సంవత్సర  కాలంలో గ్రామాలను నెలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి  రోగ విముక్తి గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ఉద్దేశం.  ఈ పథకం ద్వారా ఆయుర్వేద, హోమియో,యోగ, యునాని, ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో  తొలి విడతగా 10 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో కాసిపేట మండలం సోనాపూర్ పంచాయితీ 'ఆయుష్ గ్రామ ' పథకం కింద ఎంపికయింది. పంచాయతీ  పరిధిలోని గ్రామాల్లో   గురువారం నుండి శనివారం వరకు మూడు రోజులు 'ఆయుష్  గ్రామ' కార్యక్రమం వైద్య బృందాలు నిర్వహిస్తున్నాయి . సోనాపూర్ పంచాయతీని వరంగల్ కు చెందిన అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ దత్తత తీసుకొని  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్, హౌస్ సర్జన్లు, వైద్య  విద్యార్థులు సుమారు 50 మంది వైద్య బృందం ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. మొదటిరోజు గ్రామపంచాయతీ లోని గ్రామాలలో  ఆరోగ్య సర్వే, వ్యాధులను  గుర్తించడం చేశారు.
 రెండవ రోజు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం. ఏమి తింటే ఆరోగ్యం వస్తుంది, రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏమి తినాలి, ఆరోగ్యానికి అవసరమైన మంచి అలవాటు నేర్పడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, యోగ శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మూడవరోజు గ్రామంలో  వైద్య శిబిరం ఏర్పాటు.  గ్రామ పరిసరా ల్లోని  అడవిలో పెరటిలో ఔషధ మొక్కల ను గుర్తించడం, వాటి ద్వారా ప్రజలు  ఆకు రసం తయారు చేయడం,మందులతో  ఏ రోగాలకు ఎలా ఉపయో గించుకోవాలి దానిపై గ్రామస్తులకు శిక్షణ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో సంవత్సరం పాటు ఆయుష్ గ్రామ కార్యక్రమం అమలవుతుందని  ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్ కుమార్ 'ఎస్ సి వి న్యూస్' కు తెలిపారు. సోనాపూర్ పంచాయతీ లోని గ్రామాల ప్రజలకు రోగ విముక్తి గ్రామాలుగా తయారు చేసే అంత వరకు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. పంచాయితీకి  ప్రతి  నెల ఒక్కొక్క డిపార్టుమెంటు యునాని, హోమియో, ప్రకృతి వైద్య బృందాలు గ్రామానికి వచ్చి ఒక్కరోజు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి  వైద్య పరీక్షలు శిక్షణ ఇస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలకు రోగాలు రాకుండా వచ్చిన వాటిని ఎలా నివారించుకోవాలి తెలపడమే  'ఆయుష్ గ్రామ' ముఖ్య ఉద్దేశం అని అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి క్యాంప్ ఆఫీసర్ గా డాక్టర్ ప్రశాంత్, కాసిపేట   మండల ఆరోగ్య కేంద్ర హోమియో వైద్యురాలు శ్రీదేవి,అనంత వైద్యశాల  వైద్య నిపుణులు వసంత్, శివ దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వైద్య బృందాలను మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఆశ  వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కూడా సహకరించాయి. వైద్య శిబిరం ఏర్పాటు గ్రామాల నుండి ప్రజలను తీసుకువచ్చేందుకు సర్పంచ్ సుశీల వార్డు మెంబర్లు బృందాలకు సహకరించాయి.

 'ఆయుష్ గ్రామ' పథకం గిరిజనులకు ఎంతో మేలు.
- సోనాపూర్ సర్పంచ్ సుశీల

 ఆయుష్ గ్రామ పథకం కింద కాసిపేట  మండలంలోని సోనాపూర్ పంచాయతీ ఎంపిక కావడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని గ్రామ సర్పంచ్ మడావి సుశీల అన్నారు. పూర్వకాలం నుండి గిరిజనులు గాయాల బారిన పడినప్పుడు చెట్ల పసర్లు వేర్ల ద్వారా తయారు చేసుకుని వ్యాధుల ఉంది బయటపడి ప్రాణాలు కాపాడుకునే వారని అన్నారు. ఆయుష్  గ్రామ పథకం కింద పురాతన కాలము విధానమైన ఆయుర్వేదిక్  మందులను ఇవ్వడం, ఆకు పసరు తయారు చేయడం  తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం పాటు  వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. గ్రామ పథకం కింద తమ పంచాయతీ ఎంపిక చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App