Digital Kasipet:-
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ కు జిల్లా సంక్షేమ అధికారి మాస ఉమాదేవి షోకాజ్ నోటీసు అందించారు. కాసిపేట మండలంలోని అంగన్వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్ విధుల్లో లేకపోవడంతో ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా సంక్షేమ అధికారి మాస ఉమాదేవి అంగన్వాడీ టీచర్ కు షోకాజ్ నోటీసు అందజేశారు. దానికి సరైన సమాధానం రాకపోతే ఆమెను పూర్తిగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది.