Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలి

Digital Kasipet:-
బహుజన వర్గాలు అంతా ఏకమై అంబేద్కర్ భావజాలం కాసిపేట   మండలంలోని గ్రామపంచాయతీ లలో ప్రచారం చేస్తూ కమిటీలు వేయాలని అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షులు జాడి రామ్ చందర్  పిలుపు నిచ్చారు. ఆదివారం కాసిపేట మండలం బుగ్గ గూడెం పంచాయతీలో  అంబేద్కర్ యువజన సంఘం సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య  మాట్లాడుతూ . ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం,గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను బహుజనుల అంతా వాడుకొని అంబేద్కర్ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. మండల ఉపాధ్యక్షుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ బహుజన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు.  దేవాపూర్ గ్రామ ప్రచార కార్యదర్శి  మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుల కృషి ఫలితంగా ఏర్పడ్డ  రిజర్వేషన్ ఫలితాల వల్ల బహుజన వర్గాలవారు ప్రజాప్రతినిధులు అయినా ఐదు శాతం కూడా లేని రెడ్లు,వెలమల ఆధిపత్యమే ఎక్కువ ఉందని అన్నారు.  సమావేశానికి అధ్యక్షత వహించిన సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిశల బాపు మాట్లాడుతూ గతంలో  అంబేద్కర్  ఎస్సీ ఎస్టీలకే పరిమితమయ్యారని అపోహను తొలగించేందుకు మండలంలోని   అన్ని వర్గాలను కలుపుకుని  అంబేద్కర్ సంఘ కమిటీలు వేయడం జరుగుతుందన్నారు.  బుగ్గ గూడెం కమిటీ సలహాదారు మెయిన్రపు రాజన్న మాట్లాడుతూ అంబేద్కర్ సంఘాన్ని గ్రామంలో పటిష్టం చేసి అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సర్పంచి ఏదుల విజయలక్ష్మి హాజరయ్యారు. అనంతరం గ్రామ కమిటీని ఎంపిక చేశారు.  అంబేద్కర్ యువజన సంఘం బుగ్గగూడెం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా  ఏదుల అంజన్న,  అధ్యక్షుడిగా ఏదుల బాపు,  ఉపాధ్యక్షులుగా   సేదం ప్రశాంత్, లగడం రాజ్ కుమార్,  ప్రధాన కార్యదర్శిగా ఏదుల వంశీ, నిర్వాహక అధ్యక్షులుగా మరినేని పోచం, సంయుక్త కార్యదర్శులుగా బద్రి శంకర్, శంకర్థుల లక్ష్మణ్, ప్రచార  కార్యదర్శులుగా భీమిని రఘుపతి, గణపతి కోశాధికారిగా మెయిన్ రపు రాజన్న, సలహాదారులుగా భీమిని లక్ష్మణ్ సంకుర్తుల మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App