అంబేద్కర్ భావజాలాన్ని మండలంలోని గ్రామాలకు విస్తరించే క్రమంలో అంబేద్కర్ యువజన కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే కొందరు అడ్డుకుంటున్నారని వారు తమ పద్ధతులు మార్చు కోవాలని అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రాంచందర్ హెచ్చరించారు. ఆదివారం కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. . ముఖ్య సలహాదారులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ మండలంలో అంబేద్కర్ యువజన సంఘం విస్తరించకుండా అగ్రకులాలకు చెందిన వారు అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గోడిసెల బాపు మాట్లాడుతూ మండలంలో అంబేద్కర్ సంఘాన్ని విస్తరణ ఆడ్డుకునే వారు భవిష్యత్తులో బహుజన వర్గాల చేతిలో సాంఘిక బహిష్కరణ గురవుతారని హెచ్చరించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్, ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, ఉపాధ్యక్షుడు రామిళ్ళ కిష్టయ్య, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్ మాట్లాడారు. తదనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
అంబేద్కర్ యువజన సంఘం పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా ఆడే శేఖర్ (సామ గూడెం ), గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ రమటెంకి శ్రీనివాస్, ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా రామటెంకి రామ్ చందర్ (కోమటి చేను), ఉపాధ్యక్షుడుగా కురిసింగా వసంతరావు (రేగుల గూడెం), దుర్గం ప్రవీణ్ కొత్త వారి పేట గుండేటి రమేష్ వారి పేట కార్యనిర్వాహక అధ్యక్షుడు రమేష్, జాడి రాజయ్య కోశాధికారిగా దుర్గాప్రసాద్, ప్రచార కార్యదర్శులుగా సాంబా డి నాగరాజు, బెడ్డల శేఖర్, ముఖ్య సలహాదారులు గా దుర్గం సూర్య ప్రకాష్ (ఉపసర్పంచ్ ) రమటెంకి రాజలింగు, కురసిన్గా తిరుపతి, గుమ్మడి శంకర్, లను సభ్యులుగా దుర్గం ప్రశాంత్, రామటెంకి వినోద్, జాడి వినోద్, భూక్యా అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం ఈ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆడే శేఖర్ ను మండల శాఖ అధ్యక్షుడు జాడి రాంచందర్ ఆధ్వర్యంలోమండల కమిటీ శాలువాతో సన్మానించారు. వందన సమర్పణ ఉపసర్పంచి దుర్గం సూర్యప్రకాష్ తెలిపారు.