Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టేకు కలప పట్టివేత

Digital Kasipet:- 
కాసిపేట మండలం లక్ష్మీపూర్, కొలాంగూడెం  శివారులో గుర్తుతెలియని వ్యక్తులు దాచి ఉంచిన టేకు కలపను సోమవారం ముత్యం పెళ్లి సెక్షన్ అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ శివారు లోని అటవీ ప్రాంతంలో  తనిఖీ చేస్తుండగా 13 టేకు దుంగలు సుమారు రూ 13,430 విలువ గలిగిన టేకు కర్ర పట్టుకున్నామని ముత్యం పల్లి  డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ తెలిపారు. అడవిలోకి వెళ్లి చెట్లను నరికిన, టేకు కలప అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టేకు కలపను పట్టుకున్న వారిలో బి, రాజేష్  ఫారెస్ట్ బీట్ అధికారి, వాచర్, లక్ష్మణులు ఉన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App