Digital Kasipet:-
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించేం దుకు కృషి చేయాలని కాసిపేట ఎస్ఐ కల్యాణం నరేశ్ పేర్కొన్నారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో కాసిపేట పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్దాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాసిపేట ఎస్ఐ కల్యాణం నరేశ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధి దశ చాలా కీలకమైందని, వ్యసనాలకు అలవాటు పడితే తమ జీవితాలను నాశనం అవుతాయాని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువులపై దృష్టిసారించి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని అన్నారు. విద్యార్థులు తమ దృష్టిని కెరీర్ పై పెట్టి ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థానంలో నిలవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అను గుణంగా తమకు ఇష్టమైన రంగా ల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అందె నాగ మల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్ కూకట్ల రాజేష్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.