Digital Kasipet:-
కాసిపేట మండలం సోమగూడెం (కె) ఉపసర్పంచ్ కనుకుల రాకేష్ శనివారం రోజు మంచిర్యాలలో ఏఐసిసి మెంబెర్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోవు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని కార్యకర్తలంతా గ్రామాలలో విస్తృత ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. రాక్షస పాలనను అంతమొంది చాలంటే మీలాంటి యువత ముందు ఉండాల్సిన అవసరముంద ని,పార్టీలో కష్టపడ్డవారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కాసిపేట మండలంలో నేను పుట్టి పెరిగిన మండలం కాబట్టి కార్యకర్తలు ఎలాంటి అధైర్య పడవద్దు నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ ధర్మారావు పేట ఎం పి టి సి లు పార్వతి మల్లేష్, దేవాపూర్ ఎంపీటీసీ మెరుగు పద్మ శంక ర్,యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ షాకిర్,వార్డు సభ్యులు కొత్త రమేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాధం గట్టయ్య, నందికొండ శ్రీధర్ లు పాల్గొన్నారు.