Digital Kasipet:-
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదగడంలో మాతా రమాబాయి త్యాగం మరువలేనిదని స్వేరో రాష్ట్ర కో కన్వీనర్ అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్ అన్నారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాత రమాబాయి అంబేద్కర్ 124వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అంబేద్కర్ చదువుకోవడానికి రమాబాయి పస్తులుండి , పిడకలు తయారు చేసి అమ్మి డబ్బులు పోగు చేసి పంపించేది అని అన్నారు . దేశంలోని అణగారిన వర్గాల ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం బాబాసాహెబ్ పోరాటాలు చేస్తుంటే రమాబాయి ఎంతో సహకారాలు అందించిందని అన్నారు. తన పిల్లల ఆరోగ్యాలను కూడా కాపాడుకో లేని పేదరికంలో మగ్గుతూ ప్రజల కోసం పిల్లలందరిని కోల్పోయిన త్యాగమూర్తుల అని అన్నారు. ఇలాంటి త్యాగమూర్తుల ను బహుజన వర్గాలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ విశ్వ గురువు గా ఎదిగిన అంబేద్కర్ ప్రతి అడుగులో రమాబాయి త్యాగం ఉందని అన్నారు. దేశంలోని 85 శాతం ఉన్న బహుజనులకు స్వేచ్ఛ స్వాతంత్రము,సమానత్వం సాధించేందుకు, రమాబాయి అంబేద్కర్ లు తన కుటుంబన్నీ ను త్యాగం చేశారని అన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావి గా ఎదిగిన అంబేద్కర్ భార్య పిల్లలకు సరి అయిన తిండి లేక ఆకలి చావులతో, సరైన వైద్యం అందించకపోవడంతో నలుగురు పిల్లలు యశ్వంత్, గంగాధర్, రాజారత్నం, ఇందుల ను చిన్నతనంలోనే కోల్పో యారన్నారు. వారు ముద్దుగా పెంచుకున్న చిన్న కొడుకు రాజారత్నం చనిపోయినప్పుడు శవం మీద కప్పేందుకు తెల్లబట్ట కూడా కొనలేని దయానియమైన స్థితిలో అంబేద్కర్ కుటుంబం ఉందని అన్నారు. రమాబాయి తన చీరెను చించి రాజారత్నం శవంపై కప్పి దహనం చేశారని అన్నారు. దేశంలోని అనగారిన ప్రజలకోసం రమాబాయి అంబేద్కర్ లు తన నలుగురు పిల్లలను కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తుల అని అన్నారు . వారు చేసిన త్యాగ ఫలితంగానే భారత రాజ్యాంగం ద్వారా మనకు స్వేచ్ఛా స్వాతంత్రంతో పాటు ఎన్నో హక్కులు, రిజర్వేషన్లు వచ్చి మన కుటుంబాలు సుఖంగా జీవిస్తున్నారు. బహుజన వర్గాలు త్యాగమూర్తుల ను ఎప్పుడు గుర్తు చేసుకోవాలని అంబేద్కర్ సంఘాలు అంబేద్కర్ వాదులు జన్మదిన, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. పెద్దన పల్లి సర్పంచ్ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకుడు వేముల కృష్ణ మాట్లాడుతూ రమాబాయి త్యాగం వెలకట్టలేనిది అన్నారు. సహజంగా పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలు భార్యలను చదివిపిస్తున్నారు. కాని ఆ రోజుల్లో భర్త అంబేద్కర్ చదువు కోసం రమాబాయి కూలీ పనులు చేస్తూ, పేడను పోగు చేసి పిడకలు తయారు చేసి విక్రయించి డబ్బులు పోగు చేసి అంబేద్కర్ చదువుల కోసం పంపడం అరుదైన విషయమని అన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగు చేయాలని రమాదేవి అంబేద్కర్ దంపతులు ఎంతో త్యాగం చేశారని అన్నారు. త్యాగమూర్తుల సేవలను, వారి త్యాగాలను బహుజన సమాజమంతా ఎప్పుడు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు సిద్ధం తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు గోలేటి స్వామి,సంయుక్త కార్యదర్శులు గొడిసెల సురేందర్, కలువల శీను, లంక రాకేశ్, అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు గొడిసెల అభినయ్, అజయ్,రామటేంకి శివతేజ, ఓరం కవిరాజ్, బెంబడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.