Digtal Kasipet:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో శుక్రవారం లోడింగ్ కార్మికులు ఆందోళన విరమించారు. తమకు ఎక్కువ డ్యూటీలు కల్పించాలని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు లోడింగ్ కార్మికుడు సిడం శంకర్ కార్మాగారం ఆవరణలో సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న సిమెంటు డాక్టర్ను నిల్వచేసే సైలో టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. అతనికి మద్దతుగా మిగతా లోడింగ్ కార్మి కులు వారి కుటుంబ సభ్యులు కూడా విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. నెలకు 5 నుండి 10 డ్యూటీలు కల్పించడం వల్ల తమ కుటుంబాల పోషణ భారంగా మారి పస్తులతో ఉండాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 25 డ్యూటీలకు తగ్గ కుండా డ్యూటీ లో కల్పించాలని, మా డిమాండ్లు పరిష్కరించే దాకా ఆందోళన విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళన విరమింప చేసేందుకు ఓరియంట్ సిమెంట్ కార్మిక గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు నాయకత్వంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వడ్లూరి మల్లేష్, గడ్డం పురుషోత్తం,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, అనంత రావులు ఓరియంట్ అధ్యక్షుడు ఎస్కె పాండే, పర్సనల్ అధికారులతో డిమాండ్లపై చర్చించారు. కార్మికుల డిమాం డ్లను యాజమాన్యం ఒప్పుకో కుండా పని ఉన్నప్పుడే కల్పిస్తా మని తెలపడంతో కార్మికులు ఆందోళన విరమించలేదు. కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన తీవ్రతరం చేసి సైలో మీదికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మందమర్రి సిఐ ప్రమోద్ రావు , దేవాపూర్ ఎస్ ఐ విజేందర్ కార్మికులను వారి కుటుంబ సభ్యులకు నచ్చ జెప్పారు. కార్మిక సంఘ నాయకులకు ఓరియంట్ అధికారులకు మధ్య అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ఫలించ లేదు. సైలో ఎక్కిన లోడింగ్ కార్మికు డు సిదాం శంకర్ కిందికి దిగి రావా లని కోరిన వినలేదు. న్యాయమైన డిమాండ్ యాజమాన్యం ఒప్పుకునే దాకా దిగేది లేదని శంకర్ స్పష్టం చేశారు. రాత్రంతా శంకర్ సైలో మీద వుండడం, లోడింగ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కింద బైఠాయించి ఉన్నారు. శుక్రవారం ఉదయం మళ్లీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు నాయకత్వంలో కార్మిక సంఘం నాయకులు, యజమాన్యం తో చర్చలు జరిపి ఒప్పందం కుదు ర్చుకున్నారు. కనీస పని దినాలు 18 రోజుల నుండి 26 రోజుల వరకు ఇచ్చేందుకు యాజమాన్యా న్ని ఒప్పించారు. మార్చి 7న లిఖిత పూర్వక ఒప్పందం చేసుకునేం దుకు ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 26 నుండి కార్మికులను ప్యాకింగ్ ప్లాంట్ లో విధుల్లోకి చేర్చుకునేలా ఒప్పందం చేసు కున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్ మోహన్ రావు లిఖితపూర్వకంగా పత్రాన్ని లోడింగ్ కార్మికులకు అంద జేయడంతో కార్మికులు శాంతించి ఆందోళన విరమిం చారు. గుర్తింపు కార్మిక సంఘం రామ్మోహన్ రావు రాసిచ్చిన పత్రాన్ని కార్మికులు సిడం శంకర్ కు చూపించడంతో ల సూచన మేరకు శంకర్ సైలో దిగి కిందికి వచ్చాడు. శంకర్ ను ఆంబులెన్స్ లో ఎక్కించి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో లోడింగ్ కార్మికుల ఆందోళన ముగిసింది.