Digital Kasipet:-
కాసిపేట మండలం మామిడిగూడ గ్రామంలో శనివారం అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అటవీ చట్టం మరియు నిబంధనల గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు మాట్లాడుతూ జంతువుల కోసం ఉచ్చులు వేయడం, అడవిలో కట్టెలు కొట్టడం, అడవి జంతువులను వేటడాటం వంటివి చట్టరీత్యనేరం అని తెలిపారు. ఏవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంపత్ నాయక్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మజారుద్దిన్ , డిప్యూటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్, ఉప సర్పంచ్ భాస్కర్ మరియు వార్డు సభ్యులు గోవింద్ నాయక్, సేలియ నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు.